తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు అనుమతులిచ్చింది. అయితే, కొత్త బీర్ బ్రాండ్‌లపై నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొత్తకొత్త మీమ్స్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఆ ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు లేవనెత్తారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆ ఐదు కంపెనీలకు ఇచ్చిన అనుమతులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు సమాచారం.