బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో సా.6 నుంచి ఉ.6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టిన్‌సాంగ్ వెల్లడించారు. బంగ్లాదేశ్ తో మేఘాలయ 442 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దీంతో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు.