TG: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్

59చూసినవారు
TG: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. శాసన సభ సమావేశాలు వారం లేదా 10 రోజులు నిర్వహించేందుకు యోచన చేస్తోంది. ఎన్నికల సందర్బంగా 15 వేల రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతు భరోసాపై ప్రత్యేక చర్చ ఉండనుంది. గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన విధంగా కాకుండా.. రైతు భరోసాలో మార్పులు చేయాలని 5 ఎకరాల వరకే సీలింగ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.