క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్ పై రేపటిలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. చాహల్ IPLలో పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు ఇవ్వాలని పేర్కొంది. 2020లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. చాహల్ రూ.4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించారు.