‘ఆ UGC-NET పేపర్ నకిలీది’

85చూసినవారు
‘ఆ UGC-NET పేపర్ నకిలీది’
UGC-NET పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ ప్రశ్నాపత్రం వక్రీకరించిన స్క్రీన్‌షాట్‌ను షేర్‌చేసిన ఓ విద్యార్థిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఈ స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో కుట్ర జరగలేదని సీబీఐ గుర్తించింది. తన వద్ద పేపర్ ఉందని నమ్మించి, డబ్బు సంపాదించేందుకే దానిని వైరల్ చేసినట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్