ప్రపంచంలోనే అతి పెద్ద పాఠశాల మన దేశంలోనే ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కేంద్రంగా నడుస్తున్న సిటీ మాంటిస్సోరి స్కూల్(CMS) వరల్డ్‌లోనే లార్జెస్ట్ స్కూల్‌గా గుర్తింపు పొందింది. డాక్టర్ జగదీష్ గాంధీ, డాక్టర్ భారతీ గాంధీ కలిసి 1959లో ఈ పాఠశాలను ప్రారంభించారు. కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ స్కూల్‌లో నేడు 60 వేలకు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 4,500 మందికి పైగా స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు.