లివ్ ఇన్ పార్ట్నర్ను హత్య చేసి.. 50 ముక్కలుగా నరికిన ప్రియుడు!
జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జోర్దాగ్ గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా తన లివ్ ఇన్ పార్ట్నర్ గంగి కుమారి(24)ని దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలో పారేశాడు. అయితే నరేష్, గంగికి తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలోనే ఈ నెల 24న యువతిని గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.