జమ్మూకశ్మీర్‌లోని దోడాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు 200 అడుగుల లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.