వైట్ హౌస్ గేటును ఢీకొన్న కారు.. వ్యక్తి దుర్మరణం

74చూసినవారు
వైట్ హౌస్ గేటును ఢీకొన్న కారు.. వ్యక్తి దుర్మరణం
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్ బయట గేటును ఓ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానిక యంత్రాంగంతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. భద్రతకు సంబంధించి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. కాగా, వైట్ హౌస్ వద్ద ఇలాంటి ఘటనే జనవరిలోనూ చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్