పిల్లి చేసిన పనికి ఉద్యోగం పోయింది!
పిల్లి చేసిన పనికి ఓ యువతి ఏకంగా తన ఉద్యోగాన్నే కోల్పోయింది. చైనాకు చెందిన యువతికి ఇలాంటి విచిత్ర సంఘటన ఎదురైంది. సదరు యువతి తన రాజీనామా లేఖను టైపు చేసి డ్రాఫ్ట్‌లో ఉంచింది. ల్యాప్‌టాప్‌ను వదిలేసి వెళ్లగా, అనుకోకుండా పెంపుడు పిల్లి కీబోర్డ్ ఎంటర్ బటన్ మీద దూకింది. దీంతో ఆ మెయిల్ యువతి బాస్‌కు చేరడంతో ఉద్యోగంతో పాటు ఇయర్‌ఎండ్ బోనస్‌ను కోల్పోయింది. సీసీటీవీలో రికార్డ్ అయిన తన అనుభవాన్ని ఆ యువతి సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది.