మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ బృందం దెబ్బతిన్న ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించారు. అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అబద్ధపు ప్రచారాలు చేస్తూ కేసీఆర్ కాలం గడిపారని ఆరోపించారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా వాటర్ లీకేజీలు అవుతున్నాయన్నారు. కాళేశ్వరం కోసం ఇప్పటివరకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.