మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఔబెదుల్లగంజ్ అర్జున్ నగర్ బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో ఓ బాలిక రోడ్డు దాటేందుకు యత్నించింది. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ బాలిక గాల్లోకి ఎగిరి కింద పడింది. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు దర్యాప్
తు ప్రారంభించారు.