వీపు తోమాలన్న భర్త.. తల పగలగొట్టిన భార్య

67చూసినవారు
వీపు తోమాలన్న భర్త.. తల పగలగొట్టిన భార్య
కోపంలో భర్త తలను భార్య పగలగొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ KPHB పీఎస్ పరిధిలో జరిగింది. నల్గొండకు చెందిన కాంట్రాక్టర్ శివ భార్య, పిల్లలతో కలిసి రోడ్డు NO.3లో ఉంటున్నాడు. శుక్రవారం శివ స్నానం చేసే టైంలో వీపు తోమాలని భార్యపై అరిచాడు. 'చుట్టుపక్కల వారు వింటే పరువు పోతుంది.. ఎందుకలా అరుస్తున్నావ్' అంటూ భార్య క్షణికావేశంలో రాయితో భర్త తల పగలగొట్టగా తీవ్ర గాయం అయింది. దీంతో శివ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్