ప్రతిపక్ష హోదా కోల్పోయిన మహా వికాస్ అఘాడీ కూటమి
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు. ఈ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 15, ఎన్సీపీ (ఎస్పీ) 10 సీట్లు గెలిచాయి. కాగా, నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలవలేదు.