మధ్యప్రదేశ్‌లోని నీముచ్ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. కంకారియాకు చెందిన ముకేష్ అనే వ్యక్తి ఏడేళ్లుగా తమ గ్రామంలో అవినీతిపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఫిర్యాదు పత్రాలు, డాక్యుమెంట్లు తాడుకు కట్టి, కలెక్టరేట్ వరకు పాక్కుంటూ వెళ్లాడు. దీంతో కలెక్టర్ దిగి వచ్చి, విచారణ కమిటీని నియమించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.