కార్తీక మాసం ముగిసింది. డిమాండ్ లేక నెల రోజులుగా తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఆదివారంతో కార్తీక మాసం ముగియడంతో సోమవారం నుంచి మాంసం డిమాండ్ అధికం కానుంది. ఈ నెలలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఉన్నందున రేట్లకు రెక్కలు రానున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.200-220 ఉండగా త్వరలోనే రూ.300 దాటొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కోడిగుడ్డు ధర పెరిగింది. రిటైల్లో రూ.7 వరకు అమ్ముతున్నారు.