పుదీనాలో మతిమరుపు సమస్యను తగ్గించే లక్షణం.. తాజా అధ్యయనంలో వెల్లడి

76చూసినవారు
పుదీనాలో మతిమరుపు సమస్యను తగ్గించే లక్షణం.. తాజా అధ్యయనంలో వెల్లడి
చాలా మంది పెద్ద వయసులో మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యను పుదీనాతో కొంతవరకూ పరిష్కరించవచ్చని ఓ అధ్యయనం చెబుతోంది. అల్జీమర్స్‌ లక్షణాలున్న ఎలుకలకు కొన్ని నెలల పాటు పుదీనా వాసనను చూపించడం ద్వారా వాటిలో రోగనిరోధక శక్తి, మెదడులో విషయగ్రహణా శక్తి మెరుగుపడినట్టు ఆ పరిశోధనలో వెల్లడైంది. దీని వాసనతో అల్జీమర్స్‌కు కారణమయ్యే ‘ఇంటర్లుకిన్‌ 1 బీటా’ అనే ప్రొటీన్‌ పరిమాణం తగ్గుతున్నట్టు సైంటిస్టులు తేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్