అరెస్ట్ చేయాలంటూ.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన అత్యాచార బాధితురాలు

61చూసినవారు
అరెస్ట్ చేయాలంటూ.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన అత్యాచార బాధితురాలు
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదును అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తీవ్ర చర్యలు తీసుకుంది. తనపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని ఉన్నతాధికారులు బాధితురాలికి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్