మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దొంగలు బీరువా పగులగొట్టి అమ్మవారి నగలు, ముక్కుపుడక, మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.