వేయించిన శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. అజీర్తిని దూరం చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా శనగలు బాగా సహాయపడతాయి. వేయించిన శనగల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వేయించిన శనగలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.