మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరనేది భారీ ఉత్కంఠగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి 9 రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఈ క్రమంలో సీఎం పీఠం కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతుంటే.. మరో వైపు బీహార్ ఫార్ములా ప్రకారం తమకే ఇవ్వాలని శివసేన నేతలు అడుగుతున్నారు. దీంతో కేంద్రం ఎటూ తేల్చుకోలేక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలకు సీఎం ఎంపిక బాధ్యతలు అప్పగించింది.