వృద్ధుడిని నమ్మించి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగ (వీడియో)

58చూసినవారు
TG: బ్యాంక్ ఖాతా నుండి అప్పుడే డ్రా చేసిన డబ్బులను మళ్లీ లెక్కపెట్టి ఇస్తానని వృద్ధుడికి మాయమాటలు చెప్పి డబ్బులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. ఈ సంఘటన వేములవాడలోని యూనియన్ బ్యాంక్‌లో ఇవాళ చోటు చేసుకుంది. శాత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన గుడిసె మాణిక్యం రూ. 20 వేలు డ్రా చేశాడు. వాటిని మళ్ళీ లెక్కించాలని ఓ దొంగ వృద్ధుడికి మాయమాటలు చెప్పి అందులోని రూ.7 వేలు తీసుకుని పరారయ్యాడు. బ్యాంకు ఉద్యోగి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్