అమరులను తలచుకుంటూ.. మొహర్రం
మొహర్రం మాసంలో పీర్ల పంజా (ప్రతిమ)లను కూర్చోబెట్టిన వారు ఎర్రగా మండే నిప్పు కణికల్లో నడుచుకుంటూ వెళ్తారు. అదే విధంగా మహ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైన తమ పెద్దలను తలచుకుంటూ వారికి సంతాపంగా రెండ్రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మాసంలో తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.