అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. మా మహిళా శాసనసభ్యుల పైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని.. ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం అని కేటీఆర్ పేర్కొన్నారు.