సిమ్రన్ తయారు చేసే ఛాయ్ అంత రుచిగా ఉండటానికి కారణం ఇదే!

76చూసినవారు
సిమ్రన్ తయారు చేసే ఛాయ్ అంత రుచిగా ఉండటానికి కారణం ఇదే!
సిమ్రన్ తన ఛాయ్ చాలా ప్రత్యేకమని, అందులో వాళ్ళ ఇంట్లో తయారుచేసిన స్పెషల్ మసాలా పొడి వాడుతానని చెబుతోంది. ‘ఇంట్లో మా అమ్మ సహకారంతో నేను ప్రత్యేకంగా తయారుచేసిన టీ మసాలా పొడితోనే ఛాయ్ తయారుచేస్తా. పాలు, గులాబీ రేకులు, యాలకులు, టీ మసాలా పొడి.. వీటన్నింటినీ మరిగించి సిద్ధం చేసిన టీ ఎంతో రుచిగా ఉంటుంది.. అలాగే ఆరోగ్యానికీ మంచిది. ఈ టీ నచ్చడంతో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అలాగే మట్టి గ్లాసుల్లోనే టీ సర్వ్‌ చేస్తుంటా.'అని సిమ్రన్ అంటోంది.

సంబంధిత పోస్ట్