ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ దుండగుణ్ని ఎఫ్‌బీఐ గుర్తించింది. అతణ్ని పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన థామస్ మాథ్యూ క్రూక్స్(20)గా ధ్రువీకరించింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నాడు. కానీ, 2021లో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్ టర్న్‌ఔట్ ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం నిందితుడి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.