అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత ఇదే

67చూసినవారు
అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత ఇదే
శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మెట్లను `పదునెట్టాంబడి` అంటారు. దుష్టశక్తులను సంహరించడానికి అయ్యప్ప ఉపయోగించిన 18 ఆయుధాలని పేర్కొంటారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను (కళ్లు, చెవులు, నాసిక, నాలుక, చర్మం) తరువాతి 8 మెట్లు రాగద్వేషాలను ( తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారం) సూచిస్తాయి. మరో 3 మెట్లు సత్వ, తమో,రజో గుణాలకు ప్రతీక. 17, 18 మెట్లు విద్యను, అజ్ఞానాన్ని సూచిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్