మరోసారి స‌ల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు

60చూసినవారు
మరోసారి స‌ల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు
మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ ముఠా హత్య చేసిన విషయం తెలిసిందే. మరోసారి బాలీవుడ్ న‌టుడు సల్మాన్ ఖాన్‌కు, బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 25న వీరిద్దరికి బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు. జీషాన్ సిద్దిఖీ ఈ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబ‌ర్ 17న‌ కూడా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్