జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై 750 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో విద్యార్థులు తిరంగా ర్యాలీని నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెనపై జాతీయ జండా రెపరెపలాడింది. ఎల్లుండి ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు.