
గ్రేట్.. భర్తలను కాపాడుకున్న భార్యలు
భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు భార్య చేసే త్యాగానికి సరిహద్దులు లేవని మరోసారి నిరూపితమైంది. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ప్రాణాంతక వ్యాధితో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్ చేయడానికి కుటుంబీకుల బ్లడ్ మ్యాచ్ కాలేదు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తుల భార్యలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకరి భర్త కోసం మరొకరు లివర్ దానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. భార్యల త్యాగాన్ని పలువురు ప్రశంసించారు.