
త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి
AP: మరో 2, 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్ల కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మరోవైపు మహిళల సాధికారత టీడీపీతోనే ప్రారంభమైందని వివరించారు.