మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు కోసం తండ్రి ప్రాణం పణంగా పెట్టాడు. వివరాల్లోకి వెల్తే.. అనంతారం గ్రామానికి చెందిన వెంకటేష్ (40) కుమారుడితో కలిసి పంట పొలానికి మందు చల్లుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడికి విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ తగలడంతో తండ్రి వెంటనే అప్రమత్తమయ్యాడు. కుమారుడిని పక్కకు నెట్టడంతో విద్యుత్ తీగలు వెంకటేష్‌పై పడి అతను స్పాట్‌లోనే మృతి చెందాడు.