AP: మహానంది క్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేత ఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. గాజులపల్లె టోల్ గేట్ వద్ద ఈ వసతి గృహాలు ఉన్నాయి. అవి శిథిలమై పోవడంతో 50 గదుల నూతన వసతి గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు నాగనంది సదనం కూల్చివేతను చేపట్టారు. పైకప్పు పైన పడటంతో రాము, వెంకటేశ్వర్లు అనే కార్మికులు ప్రాణాలు విడిచారు.