రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.. వీడియో వైరల్

582చూసినవారు
ముంబైలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో థానే రైల్వే స్టేషన్ లో ఓ లోకల్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒకేసారి దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అప్పటికే పూర్తిగా నిండిన రైలు ఎక్కేందుకు వందలాది మంది మహిళలు తోసుకోవడం వీడియోలో కనిపించింది.

సంబంధిత పోస్ట్