అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ట్రంప్‌తో భేటీ అయ్యారు. తాజాగా 'గవర్నర్ ఆఫ్ కెనడా' అంటూ ట్రంప్ ట్రూడోను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా సంబోధించారు. వలసలు ఆపకపోతే కెనడా అమెరికాకు 51వ రాష్ట్రం అవుతుందంటూ చురకలంటించిన నేపథ్యంలో ఆయన్ను గవర్నర్‌గా పేర్కొనడం చర్చనీయాంశమైంది.