ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసిన టర్కీ

75చూసినవారు
ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసిన టర్కీ
ఇజ్రాయిల్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు టర్కీ శుక్రవారం ప్రకటించింది. గాజాలో పెరుగుతున్న మానవతా సంక్షోభ పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్‌కు ఎగుమతులు, ఆ దేశం నుండి దిగుమతులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు టర్కీ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ”ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఎగుమతి, దిగుమతి లావాదేవీలు నిలిపివేయబడ్డాయి. అన్ని రకాల ఉత్పత్తులు దీని కిందకు వస్తాయి” అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్