యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిజ్నోర్‌లోని థానా నూర్‌పూర్, లిందర్‌పూర్ గ్రామంలోని డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులు కూడా అదే సెంటర్‌లో చికిత్స పొందుతున్నవారేనని పోలీసులు వెల్లడించారు.