డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?

73చూసినవారు
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఉదయనిధికి ప్రమోషన్ కల్పించాలని DMK ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే DMK తరుపున ఉదయనిధి రాష్ట్రమంతటా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్