AP: శ్రీశైలంలో మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.