భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు: మధ్యప్రదేశ్ హైకోర్టు

43471చూసినవారు
భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు: మధ్యప్రదేశ్ హైకోర్టు
వైవాహిక అత్యాచార ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది. 2019 నాటి కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది. భర్త తనతో పలుమార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడంటూ ఓ మహిళ 2019లో కేసు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ మహిళ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. సెక్షన్ 377 ప్రకారం భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని అతడి లాయర్ వాదించారు.

సంబంధిత పోస్ట్