దేశంలో ప్రముఖ వాహన సంస్థలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టయోటా వాహన విక్రయాల్లో వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది క్రితం ఇదే నెలలో విక్రయించిన 1,34,158 వాహనాలతో పోలిస్తే నవంబర్‌లో 5% సేల్స్ పెరిగాయి. మారుతీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 29 శాతానికి చేరుకుంది. యుటిలిటీ వాహనాలైన బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6 వాహనాల విక్రయాలు 49,016 నుంచి 59,003కు పెరిగాయి.