ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భర్తను పోగొట్టుకున్న ఓ గర్భిణికి రూ.50 వేలు ఇచ్చి సహాయం చేశారు. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ "కృష్ణ అనే వ్యక్తి అనుకోని విధంగా అనారోగ్యం కారణంగా మరణించాడు. ఇంకొక వారంలో నిండు చూలాలైన అతడి భార్యకు డెలివరీ ఉంది. ఈ సమయంలో భర్తను కోల్పోయి కష్టాల పాలైన ఆమెకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది." అని ఆమెకు ధైర్యం చెప్పారు.