కాంగ్రెస్ పార్టీకి విజ‌య‌శాంతి దూరం..!

85చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి విజ‌య‌శాంతి దూరం..!
తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం తెర‌మీదికి వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్ర‌ముఖ న‌టి విజ‌య‌శాంతి.. ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. క‌లివిడిగా కూడా ఉండ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. పార్టీ నాయ‌కుల‌కు, పార్టీ వ‌ర్గాల‌కు కూడా ఆమె అందుబాటులో ఉండ‌డం లేదు. దీంతో ఆమె పార్టీ నుంచి దూర‌మ‌వుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిలో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నే విష‌యం తెలియ‌క‌పోయినా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే వాద‌న వినిపిస్తోంది.
Job Suitcase

Jobs near you