VIDEO: ఘోర ప్రమాదం.. మినీ బస్సు తగలబడి నలుగురు మృతి

68చూసినవారు
పుణేలోని హింజెవాడీ ఐటీ పార్క్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. IT ఉద్యోగులతో వెళ్తున్న మినీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 10 మంది గాయపడ్డారు. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెనుక డోర్ ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు బస్సులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

SOURCE: FPJ

సంబంధిత పోస్ట్