చాలా మంది పోలీసులు సామాజిక సేవకులుగా మారుతున్నారు. విధినిర్వహణలో అంకితభావంతో ప్రశంసలను అందుకుంటున్నారు. తాజాగా ముంబైలోని అహ్మదాబాద్ హైవేపై భారీగా గుంతలు పడ్డాయి. వాటిలో వర్షపు నీరు చేరింది. తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పోలీసులు స్పందించి, రహదారిపై గుంతలు పూడ్చారు. వర్షంలో తడుస్తూనే పని పూర్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.