ఒకే గుంతలో పాము, ముంగిసలు ఉన్నాయి. ముంగిసను చూడగానే పడగ విప్పిన పాము.. దాన్ని కాటేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ముంగిస ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ దాని కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూ ఎదురుదాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో చివరకు పాము తలను ముంగిస గట్టిగా పట్టేసుకుంటుంది. పాము తలను కొరికి తన కాళ్ల కింద గట్టిగా అదిమి పడుతుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరలవుతుంది.