ప్రాంక్ చేసిన యువకుడిని ఓ వృద్ధుడు కర్రతో చితకబాదారు. రోడ్డుపై యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఓ యువకుడు నటించాడు. అది గమనించిన ఓ వృద్ధుడు యువకుడిని అడ్డుకుని కర్రతో చితకబాదారు. ప్రాంక్ వీడియో అని చెప్పడంతో యువకుడిని వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. ప్రాంక్ వీడియో చేసిన యువకుడికి తాత బాగా బుద్ధి చెప్పారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.