ఓ యువతి తన ఇంట్లోని సోఫాలో పడుకుని ఉండగా.. ఓ పెద్ద మొసలి మెల్లిగా ఆమె సోఫా వద్దకు వచ్చింది. అనుమానం వచ్చిన ఆమె.. పక్కకు తిరిగి చూసి ఖంగుతుంది. వెంటనే కేకలు పెడుతూ అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. సోఫా వద్దకు వచ్చిన మొసలి.. మెల్లి మెల్లిగా సోఫా పైకి ఎక్కే ప్రయత్నం చేసింది. మొసలి వెనుకే ఓ యువకుడు కూడా ఉన్నాడు. ఇలా చాలా సేపు ఆ మొసలి ఇంట్లో హల్చల్ చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.