వెన్నచేడ్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్

79చూసినవారు
వెన్నచేడ్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామాన్ని కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం, అదే కార్యాలయంలో ఉన్న హెల్త్ సెంటర్ ను పరిశీలించి, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఇచ్చే ఆహార వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ నరేందర్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్