సెప్టెంబర్ 1 నుంచి రాగి జావ బంద్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజు రాగి జావ పంపిణీని ఆగస్టు నెల వరకు అందించామని పెద్దేముల్ మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ బుధవారం తెలిపారు. ప్రభుత్వం బెల్లం, రాగి పొడి సరఫరా చేయలేదని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పంపిణీ ఆగి పోయిందని వివరించారు. తద్వారా రాగిజావా ఇవ్వడం లేదని అన్నారు.